వందేళ్ల క్రితం దేశం / ప్రపంచం లో ఏమి జరుగుతుందో తెలిసేది కాదు .
కస్టపడి తెలుసుకొన్న వారు కొత్త అవకాశాలను ఉపయోగించుకొని ప్రగతిబాటలో ముందంజ వేశారు .
ముప్పై- నలబై ఏళ్ళ క్రితం సమాచారం అందరికీ అందుబాటులో కి వచ్చింది .
ఇప్పుడు టన్నుల కొద్దీ సమాచారం .. వద్దనుకున్నా సమాచారం ..
యు ట్యూబ్ లో.. వెబ్ సైట్ ల లో … వాట్సాప్ ల లో ..
ఉప్పు తినాల్సిన అవసరమే లేదని ఒకాయన .. మన శరీరానికి ఏది ఎంత తీసుకోవాలో తెలుసు .. ఎక్కువ తీసుకొన్నదాన్ని అది బయటకు నెట్టేస్తుంది .. కాబట్టి ఉప్పు ఇంతే తీసుకోవాలి అని రూల్ ఏమీ ఉండదు అని ఇంకో ఆయన .. ఉప్పు పరిమితంగా తీసుకోవాలి . ఇది గో ఇలా చెయ్యండి అని ఒకాయన ..
వాక్సిన్ లు వేసుకొంటే ఒంటికి బలం అని ఒకాయన .. అసలు వాక్సిన్ లే వద్దు అని ఒకాయన .. మామూలు వాక్సిన్ ల సంగతి వేరు .. కరోనా వాక్సిన్ సంగతి వేరు .. మన దేశం లో గత అనేక ఏళ్లుగా వాడుతున్న వాక్సిన్ లు అవసరమే .. కానీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినవి వద్దు అని ఒకాయన ..
పెరిగిన గుండెపోట్లకు ప్రధాన కారణం .. వాక్ సీన్ లే అని ఒకాయన .. అబ్బే అయన జిం కు పోవడం వల్లే .. లిక్విడ్ డైట్ వల్లే .. డాన్స్ చెయ్యడం వల్లే .. సర్జరీ లు చెయ్యడం వల్లే .. అని ఇంకో ఆయన..
ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చదివితేనే భవిష్యత్తు అని ఒకరు .. లేదు సిబిఎస్సీ స్కూల్ లో చదివితేనే అని ఇంకొకరు .. బ్రాండ్ కాదు .. పాఠం చెప్పేవిధానం ముఖ్యం అని ఒకాయన ..
లోన మిత్రత్వం .. పైన వైరి నటించే రాజకీయ నాయకులు.. పార్టీ లు ..
జనాల్ని ఎన్నో ఏళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ .. ఇప్పుడు ఇదే కొనండి అని చెప్పే ఒకాయన ..అది ఫేక్ అని ఇంకో ఒకాయన
ఏది నిజమో.. ఏది అబద్దమో .. ఏది ఫేకో.. ఏదో చాకో .. ఏది కేకో .. ఎవరని నమ్మాలో .. ఎవరని నమ్మ కూడదో తెలియని స్థితిలో జనాలు .
క్రిమినల్స్ కూడా అవతలి వారి పై ఆరోపణలు చేసి అందరూ అందరే అని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న స్థితి.
మీడియా లో… సోషల్ మీడియా లో ఇలా టన్నులకొద్దీ సమాచారం వచ్చి పడడం తో తికమక లో అత్యధిక శాతం ప్రజలు . వీడు ఒక విషయాన్ని చెబుతున్నాడు అంటే వీడికి ఏదో ఎజెండా వుండేవుంటుంది అనుకొనే స్థితి .
ఒకటి నిజం . ఇప్పుడు మనం వున్నది అతి సమాచార యుగం లో .. ఇంకో మాటలో చెప్పాలంటే తప్పుడు సమాచారం యుగం లో.
మాఫియా ల .. డాన్ ల.. కేటుగాళ్లు .. నేరస్తుల .. చీటర్ ల.. ఆయుధం సమాచారమే . సమాచారం తోనే చంపేస్తారు . దోచేస్తారు .
హీరో ల .. మంచి కోరే వారి .. ప్రగతి కాముకులు ఆయుధం కూడా సమాచారమే .
కాకపోతే ఎవడు హీరో ? ఎవడు విలన్ ? ఎవడు కేటు ? ఎవడు నీటు? ఎవడు లోఫర్ ? ఎవడు టీచర్ ?
తెలిసేది ఎలా ?
వినదగు నెవ్వరు చెప్పిన .. వినినంతనే వేగపడక వివరింపతగున్ .. కనికల్ల నిజము తెలిసినవాడే ..
అవును కనికల్ల నిజము తెలిసినవాడే బతుకుతాడు .
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ యుగం లో క్రిటికల్ థింకింగ్ మాత్రమే రియల్ ఇంటలిజెన్స్ .
బతికి బట్టకట్టాలంటే ఇది అవసరం . లేదంటే ఆస్తులు .. అంతస్తులు .. చివరికి ప్రాణం కూడా దక్కదు .
Amarnath Vasireddy
ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే,
Join my
🤩 WhatsApp community.
https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N