About us
Mission:
బట్టిపట్టి చదివే విద్యావిధానం నుండి అర్థం చేసుకొని చదివే విధానంలోకి విధ్యార్థులు మారడానికి ప్రోత్సహిస్తూ , knowledge కోసం చదివే స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడం
మరియు స్టూడెంట్స్ కి Maths, science and technology లో అవగాహన పొందేలా చేయడం.
Long description:
10 th క్లాస్ ని పూర్తిచేసిన విద్యార్ధులని ఇంటర్ లో జాయిన్ చేసిన తరువాత అందులో ఒక MPC విద్యార్థిని , మీరు ఈ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగితే నాకు బయాలజీ అండ్ సోషల్ అంటే ఇష్టం లేదు అని , ఒక BI.P.C విద్యార్థిని అడిగితే నాకు లెక్కలు రావు , సోషల్ అంటే చిరాకు అని మరియు ఒక CEC విద్యార్థిని అడిగితే నాకు సైన్సు అన్న మాథ్స్ అన్న చాలా భయం ఇదైతే ఎలాగోలా బట్టి పట్టేయచ్చు అని సమాధానం చెబుతున్నారు . దాదాపు 99% వాళ్ళు ఎంచుకున్న కోర్స్ వాళ్ళకి నచ్చి ఎంచుకోవడం లేదు, అందులో మిగతావన్ని వాళ్ళకి నచ్చక మరియు రాదు కాబట్టి అలా వదిలేయగా మిగిలినవి సెలెక్ట్ చేసుకుంటున్నారు , అంతే తప్ప ఏ ఒక్క విద్యార్థి కూడా తనకు అ సబ్జెక్టు పై ఆసక్తితోనో లేదా ఇష్టం తోనో ఎంచుకోవడం లేదు . ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ అలా ఇష్టంతో ఎంచుకున్న వాళ్ళకి తల్లిదండ్రుల సపోర్ట్ ఉండడంలేదు.
అందువల్ల వాళ్ళు తాము చదువుతున్న సబ్జెక్టు పై ఆసక్తి చూపలేకపోతున్నారు
దీనికి అసలు కారణం 10th వరకు వాళ్ళు చదివిన చదువులు కేవలం మార్కుల కోసమే అన్నట్టుగా ఉండడం
అలా కాకుండా 6th వరకు స్టూడెంట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో అవగాహన కలిగించి ,దాని ఆధారంగా స్టూడెంట్స్ ఏ సబ్జెక్టు లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడో గుర్తించి , ఆ సబ్జెక్టు లో అతనికి నైపుణ్యం పెరిగేలా ప్రోత్సాహించడం ఆ విద్యార్థి తను అనుకున్న రంగం లో తనకి ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఈ దిశగా తల్లిదండ్రులలో , ఉపాధ్యాయులలో , మరియు విద్యా వ్యవస్థలో అవగాహన కలిగించి వారందరి ఉమ్మడి సహకారంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయడమే మా ముఖ్య ఉద్దేశం.