Critical thinking

వందేళ్ల క్రితం దేశం / ప్రపంచం లో ఏమి జరుగుతుందో తెలిసేది కాదు .
కస్టపడి తెలుసుకొన్న వారు కొత్త అవకాశాలను ఉపయోగించుకొని ప్రగతిబాటలో ముందంజ వేశారు .

ముప్పై- నలబై ఏళ్ళ క్రితం సమాచారం అందరికీ అందుబాటులో కి వచ్చింది .

ఇప్పుడు టన్నుల కొద్దీ సమాచారం .. వద్దనుకున్నా సమాచారం ..

యు ట్యూబ్ లో.. వెబ్ సైట్ ల లో … వాట్సాప్ ల లో ..

ఉప్పు తినాల్సిన అవసరమే లేదని ఒకాయన .. మన శరీరానికి ఏది ఎంత తీసుకోవాలో తెలుసు .. ఎక్కువ తీసుకొన్నదాన్ని అది బయటకు నెట్టేస్తుంది .. కాబట్టి ఉప్పు ఇంతే తీసుకోవాలి అని రూల్ ఏమీ ఉండదు అని ఇంకో ఆయన .. ఉప్పు పరిమితంగా తీసుకోవాలి . ఇది గో ఇలా చెయ్యండి అని ఒకాయన ..

వాక్సిన్ లు వేసుకొంటే ఒంటికి బలం అని ఒకాయన .. అసలు వాక్సిన్ లే వద్దు అని ఒకాయన .. మామూలు వాక్సిన్ ల సంగతి వేరు .. కరోనా వాక్సిన్ సంగతి వేరు .. మన దేశం లో గత అనేక ఏళ్లుగా వాడుతున్న వాక్సిన్ లు అవసరమే .. కానీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినవి వద్దు అని ఒకాయన ..

పెరిగిన గుండెపోట్లకు ప్రధాన కారణం .. వాక్ సీన్ లే అని ఒకాయన .. అబ్బే అయన జిం కు పోవడం వల్లే .. లిక్విడ్ డైట్ వల్లే .. డాన్స్ చెయ్యడం వల్లే .. సర్జరీ లు చెయ్యడం వల్లే .. అని ఇంకో ఆయన..

ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చదివితేనే భవిష్యత్తు అని ఒకరు .. లేదు సిబిఎస్సీ స్కూల్ లో చదివితేనే అని ఇంకొకరు .. బ్రాండ్ కాదు .. పాఠం చెప్పేవిధానం ముఖ్యం అని ఒకాయన ..

లోన మిత్రత్వం .. పైన వైరి నటించే రాజకీయ నాయకులు.. పార్టీ లు ..

జనాల్ని ఎన్నో ఏళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ .. ఇప్పుడు ఇదే కొనండి అని చెప్పే ఒకాయన ..అది ఫేక్ అని ఇంకో ఒకాయన

ఏది నిజమో.. ఏది అబద్దమో .. ఏది ఫేకో.. ఏదో చాకో .. ఏది కేకో .. ఎవరని నమ్మాలో .. ఎవరని నమ్మ కూడదో తెలియని స్థితిలో జనాలు .

క్రిమినల్స్ కూడా అవతలి వారి పై ఆరోపణలు చేసి అందరూ అందరే అని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న స్థితి.

మీడియా లో… సోషల్ మీడియా లో ఇలా టన్నులకొద్దీ సమాచారం వచ్చి పడడం తో తికమక లో అత్యధిక శాతం ప్రజలు . వీడు ఒక విషయాన్ని చెబుతున్నాడు అంటే వీడికి ఏదో ఎజెండా వుండేవుంటుంది అనుకొనే స్థితి .

ఒకటి నిజం . ఇప్పుడు మనం వున్నది అతి సమాచార యుగం లో .. ఇంకో మాటలో చెప్పాలంటే తప్పుడు సమాచారం యుగం లో.

మాఫియా ల .. డాన్ ల.. కేటుగాళ్లు .. నేరస్తుల .. చీటర్ ల.. ఆయుధం సమాచారమే . సమాచారం తోనే చంపేస్తారు . దోచేస్తారు .

హీరో ల .. మంచి కోరే వారి .. ప్రగతి కాముకులు ఆయుధం కూడా సమాచారమే .

కాకపోతే ఎవడు హీరో ? ఎవడు విలన్ ? ఎవడు కేటు ? ఎవడు నీటు? ఎవడు లోఫర్ ? ఎవడు టీచర్ ?

తెలిసేది ఎలా ?

వినదగు నెవ్వరు చెప్పిన .. వినినంతనే వేగపడక వివరింపతగున్ .. కనికల్ల నిజము తెలిసినవాడే ..

అవును కనికల్ల నిజము తెలిసినవాడే బతుకుతాడు .

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ యుగం లో క్రిటికల్ థింకింగ్ మాత్రమే రియల్ ఇంటలిజెన్స్ .

బతికి బట్టకట్టాలంటే ఇది అవసరం . లేదంటే ఆస్తులు .. అంతస్తులు .. చివరికి ప్రాణం కూడా దక్కదు .
Amarnath Vasireddy
ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే,
Join my
🤩 WhatsApp community.
https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N

👉

ఐఐటీ లు – ఆత్మ హత్యలు :

ఐఐటీ లు – ఆత్మ హత్యలు :

👉ఐఐటీ లో సీట్ వచ్చిందంటే” లైఫ్” అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు .

👉పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది .. చివరకు సీట్ సాధించేది 16 వేలమంది .

👉అంటే ఐఐటీ లో సీట్ కొట్టిన వారు త్రీ రోజెస్ టీ లాగ, “వేలాది లో ఒక్కరు” .

ఐఐటీ లో విద్యా ప్రమాణాలు చాలా బాగుంటాయి .

కోర్స్ పూర్తి చేస్తే భారీ శాలరీ ప్యాకేజీ తో మంచి ఉద్యోగం ఖాయం .

❓మరి ఆత్మ హత్యలెందుకు ?

⁉️ఏదో ఒకటి రెండు అయితే ఏదో అనుకోవచ్చు .

ఐఐటీ చెన్నై లో గత రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు .

అన్ని ఐఐటీలలో కలిపి నాలుగేళ్లలో నలబై దాకా !

❓ఎందుకిలా ?

1 . ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ ఆరో తరగతి నుంచే పిల్లల్ని ఆటపాటలుకు దూరం చేస్తున్నారు . దీని వల్ల , వీరిలో గ్రోత్ హార్మోన్ లోపం ; హ్యాపీ హార్మోన్స్ తగినంత ఉత్పత్తి కావు . విపరీతమైన ఒత్తిడి వల్ల కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది . దీని వల్ల చిరాకు , అసహనం , నిద్ర లేమి , ఆత్మ న్యూనతా భావం , అభద్రత , కుంగుబాటు లాంటి నెగటివ్ మానసికోద్వేగా భావాలు కలుగుతాయి . ఒక అంచనా ప్రకారం ఐఐటీ లో చదివే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు డిప్రెషన్ లాంటి మానసిక రోగాలతో బాధ పడుతున్నారు .

2 . క్రీడలకు దూరం కావడం వల్ల క్రీడా స్ఫూర్తి కొరవడుతోంది . చిన్న సమస్యకు కుంగిపోవడం .. ఆత్మ హత్యలు ..

౩. తెలుగు , ఇంగ్లీష్ హిందీ .. ఈ సబ్జెక్టు లో అంతర్లీనంగా లైఫ్ స్కిల్స్ పాఠాలుంటాయి. ఐఐటీ ఫౌండేషన్ లో కేవలం గణితం , భౌతిక శాస్త్రం పై ద్రుష్టి నిలపడం జరుగుతోంది . కేవలం పరీక్ష కోసం తూతూ మంత్రంగా లిటరేచర్ అలాగే సోషల్ స్టడీస్ ను చదవక పోవడం వల్ల , ఇంగిత జ్ఞానం , సామజిక -భావోద్వేగ తెలివితేటలు లోపిస్తున్నాయి .

4 .ఐఐటీ క్యాంపస్ లో కుల వివక్ష దారుణంగా ఉంటోంది . నిమ్న కులాల వారి ని టార్గెట్ చేసుకొని వ్యవహారాలు నడుస్తుంటాయి .

పరిష్కారం :

✔️ప్రపంచం లో ఎన్నో ఉత్తమ విద్యా సంస్థలున్నాయి . వాటికీ ప్రవేశ పరీక్షలున్నాయి . ఆ పరీక్షల కోసం మహా అంటే ఆరు నెలలు ప్రిపేర్ అయితే సరిపోతుంది . చిన్నపటి నుంచి సంపూరణాత్మక విద్య పొందిన విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ కూడా పెద్దగా అవసరం లేకుండా పోతుంది .

❌దీనికి బిన్నంగా ఐఐటీ జేఈఈ పరీక్షను రూపొందించారు . ఏళ్ళ తరబడి గణితాన్ని భౌతిక శాస్త్రాన్ని చదివిన వారికి.. అది కూడా క్రీడలు అల్ రౌండ్ డెవెలప్మెంట్ లాంటి వాటిని పక్కన పెట్టి, కోచింగ్ కోళ్లుగా మారిన వారికి మాత్రమే, ఈ పరీక్ష లో విజయం దక్కేలా ఆ పరీక్ష ను డిజైన్ చేసారు .

🈵పేరుకు ఎన్నో సంస్కరణలు వచ్చాయి . అంతా గారడి ! నాటకాలు .. పచ్చి బూటకాలు.

🐅ఐఐటీ కోచింగ్ వేల కోట్ల ఇండస్ట్రీ . ప్రత్యక్ష పరోక్ష పాత్రధారులు ఎంతో మంది . లబ్ది దారులు ఎంతో మంది . పాపపు సొమ్ము కు అలవాటు పడిపోయారు . మనిషి రక్తం మరిగిన పులి శాఖాహారి అవుతుందా ? .

ఏదో అద్భుతం జరిగితే తప్పించి వ్యవస్థ మారదు .

👉ఆరో తరగతి నుంచే కోట్లాది పిల్లల బాల్యం బుగ్గి పాలవుతోంది . ఇంటర్ .. అది ముగిసాక పరీక్ష రాసేవరకు బతుకు పరమ దుర్భరం బ్రిటిష్ కాలం నాడు పోర్ట్ బ్లెర్ లోని సెల్యూలర్ జైలు . నేడు కోట ..ఇంకా తెలుగు నాట కార్పొరేట్ కోళ్ల ఫారాలు .కోట లో కోటి కన్నీటి కథలు . తెలుగు నాట కోళ్ల ఫారాలలో ఎనెన్నో వ్యధలు.

👉లక్షల్లో ఒకడుఐఐటీ డిగ్రీ తో అమెరికా కెళుతాడు . అమెరికా కు వెళ్ళిపోతే సినిమా సూపర్ హిట్ అనుకొనే ఇక్కడి పేరెంట్స్ కు అక్కడి పిల్లలకేసే గంపెడు వాక్ సీన్ లు . దాని వల్ల పుట్టబోయే మనుమలు మనుమరాండ్రు కు వచ్చే అవకాశమున్న ఆటో ఇమ్యూన్ వ్యాధులు , ఆటిజాలు గురించి తెలియదు . చెప్పినా నమ్మరు . చెప్పేవాడికి మతి లేదని లేదా అందని ద్రాక్ష పుల్లన అంటారు.

అజ్ఞానమే ఆనందం.

❌అర్జెంటు గా అమెరికా కు వెళ్ళిపోవాలి . అక్కడి డాలర్ లు ఇక్కడికి పంపిస్తే నాలుగు సైట్స్ కొనాలి . అందరితో గొప్పలు చెప్పుకోవాలి . అటు పై అరవై అయిదు వచ్చే వరకు రెండేళ్లకు ఒక సారి అక్కడికెళ్లి వచ్చి నాలుగురుకి కబుర్లు చెప్పాలి .. ఇదీ ఆలోచన … .ఇదీ తీరు

ఈ పోస్ట్ భావమేమి ?

ఐఐటీ లో చేరొద్దన్నా ? అమెరికా కు వెళ్లొదనా ?

✔️కానే కాదు. ఐఐటీ లు ప్రపంచ స్థాయి సంస్థలు . ఉత్తమ విద్యా ప్రమాణాలు .

✔️అమెరికా కో మరో చోటుకు వెళ్లడం సహజం . మనది నేడు విశ్వ గ్రామం . రానున్నది రోబో యుగం .

❌అమెరికా కో ఇంకో చోటుకు వెళిపోతేనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి .. అక్కడికి పొతే ఇక సమస్యలే ఉండవు –అనుకోవడమే పెద్ద సమస్య .

👉సమస్యలు లేని చోటు సమాధి ఒక్కటే ..

సమస్యలు లేని జీవితం నరకం అని తెలుసుకోకపోవడం వీరి అజ్ఞానం

❌తాను సాధించలేని దాన్ని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని అనుకోవడం .

❌పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోక పోవడం .

❌అన్నిటికీ మించి “కోచింగ్ కోసం .. కోచింగ్ ద్వారా … కోచింగ్ మూలంగా” సాగే ఐఐటీ సీట్ ల భర్తీ . అందుకే ఒక టీవీ ఇంటర్వ్యూ లో నేను ఐఐటీ లు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పాను. కోట్లాది పిల్లల శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మొత్తంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేసి సాగుతున్న రాక్షస క్రీడ ఐఐటీ జేఈఈ పరీక్ష .

✔️ఐఐటీ లు సంతోష కర జీవనాన్ని సాగించడానికి ఒక మార్గం . ఎవరూ కాదనలేని సత్యం .

కానీ ఐఐటీ లో సీట్ సాధించడమే జీవితం . ఆ ప్రయత్నం లో పిల్లల మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత నాశనం అయినా ఫరవాలేదు అనుకొనే సగటు మధ్య తరగతి పేరెంట్ మనస్తత్వం మారనంత వరకు… ఇండియా లో బాల్యం శాపమే ! .

Amarnath Vasireddy

ఇలాంటి మరోన్నో అంశాలపై పోస్ట్ లు నా Telegram Channel లో చూడొచ్చు. ఛానల్ లింక్స్ కోసం 

 7207439500 కి Telegram app  లో msg చేయండి 

లేదా 

Join my  WhatsApp community. https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N

You Can Also Follow me on

Facebook Page
https://www.facebook.com/ismartmathsapp
Facebook Profile
https://www.facebook.com/shravanmaths

Facebook Group

https://www.facebook.com/groups/ShravansMathsInstagram
https://www.instagram.com/shravanmaths/Twitter
https://twitter.com/jsk22330/