ఐఐటీ లు - ఆత్మ హత్యలు :
👉ఐఐటీ లో సీట్ వచ్చిందంటే" లైఫ్" అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు .
👉పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది .. చివరకు సీట్ సాధించేది 16 వేలమంది .
👉అంటే ఐఐటీ లో సీట్ కొట్టిన వారు త్రీ రోజెస్ టీ లాగ, "వేలాది లో ఒక్కరు" .
ఐఐటీ లో విద్యా ప్రమాణాలు చాలా బాగుంటాయి .
కోర్స్ పూర్తి చేస్తే భారీ శాలరీ ప్యాకేజీ తో మంచి ఉద్యోగం ఖాయం .
❓మరి ఆత్మ హత్యలెందుకు ?
⁉️ఏదో ఒకటి రెండు అయితే ఏదో అనుకోవచ్చు .
ఐఐటీ చెన్నై లో గత రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు .
అన్ని ఐఐటీలలో కలిపి నాలుగేళ్లలో నలబై దాకా !
❓ఎందుకిలా ?
1 . ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ ఆరో తరగతి నుంచే పిల్లల్ని ఆటపాటలుకు దూరం చేస్తున్నారు . దీని వల్ల , వీరిలో గ్రోత్ హార్మోన్ లోపం ; హ్యాపీ హార్మోన్స్ తగినంత ఉత్పత్తి కావు . విపరీతమైన ఒత్తిడి వల్ల కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది . దీని వల్ల చిరాకు , అసహనం , నిద్ర లేమి , ఆత్మ న్యూనతా భావం , అభద్రత , కుంగుబాటు లాంటి నెగటివ్ మానసికోద్వేగా భావాలు కలుగుతాయి . ఒక అంచనా ప్రకారం ఐఐటీ లో చదివే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు డిప్రెషన్ లాంటి మానసిక రోగాలతో బాధ పడుతున్నారు .
2 . క్రీడలకు దూరం కావడం వల్ల క్రీడా స్ఫూర్తి కొరవడుతోంది . చిన్న సమస్యకు కుంగిపోవడం .. ఆత్మ హత్యలు ..
౩. తెలుగు , ఇంగ్లీష్ హిందీ .. ఈ సబ్జెక్టు లో అంతర్లీనంగా లైఫ్ స్కిల్స్ పాఠాలుంటాయి. ఐఐటీ ఫౌండేషన్ లో కేవలం గణితం , భౌతిక శాస్త్రం పై ద్రుష్టి నిలపడం జరుగుతోంది . కేవలం పరీక్ష కోసం తూతూ మంత్రంగా లిటరేచర్ అలాగే సోషల్ స్టడీస్ ను చదవక పోవడం వల్ల , ఇంగిత జ్ఞానం , సామజిక -భావోద్వేగ తెలివితేటలు లోపిస్తున్నాయి .
4 .ఐఐటీ క్యాంపస్ లో కుల వివక్ష దారుణంగా ఉంటోంది . నిమ్న కులాల వారి ని టార్గెట్ చేసుకొని వ్యవహారాలు నడుస్తుంటాయి .
పరిష్కారం :
✔️ప్రపంచం లో ఎన్నో ఉత్తమ విద్యా సంస్థలున్నాయి . వాటికీ ప్రవేశ పరీక్షలున్నాయి . ఆ పరీక్షల కోసం మహా అంటే ఆరు నెలలు ప్రిపేర్ అయితే సరిపోతుంది . చిన్నపటి నుంచి సంపూరణాత్మక విద్య పొందిన విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ కూడా పెద్దగా అవసరం లేకుండా పోతుంది .
❌దీనికి బిన్నంగా ఐఐటీ జేఈఈ పరీక్షను రూపొందించారు . ఏళ్ళ తరబడి గణితాన్ని భౌతిక శాస్త్రాన్ని చదివిన వారికి.. అది కూడా క్రీడలు అల్ రౌండ్ డెవెలప్మెంట్ లాంటి వాటిని పక్కన పెట్టి, కోచింగ్ కోళ్లుగా మారిన వారికి మాత్రమే, ఈ పరీక్ష లో విజయం దక్కేలా ఆ పరీక్ష ను డిజైన్ చేసారు .
🈵పేరుకు ఎన్నో సంస్కరణలు వచ్చాయి . అంతా గారడి ! నాటకాలు .. పచ్చి బూటకాలు.
🐅ఐఐటీ కోచింగ్ వేల కోట్ల ఇండస్ట్రీ . ప్రత్యక్ష పరోక్ష పాత్రధారులు ఎంతో మంది . లబ్ది దారులు ఎంతో మంది . పాపపు సొమ్ము కు అలవాటు పడిపోయారు . మనిషి రక్తం మరిగిన పులి శాఖాహారి అవుతుందా ? .
ఏదో అద్భుతం జరిగితే తప్పించి వ్యవస్థ మారదు .
👉ఆరో తరగతి నుంచే కోట్లాది పిల్లల బాల్యం బుగ్గి పాలవుతోంది . ఇంటర్ .. అది ముగిసాక పరీక్ష రాసేవరకు బతుకు పరమ దుర్భరం బ్రిటిష్ కాలం నాడు పోర్ట్ బ్లెర్ లోని సెల్యూలర్ జైలు . నేడు కోట ..ఇంకా తెలుగు నాట కార్పొరేట్ కోళ్ల ఫారాలు .కోట లో కోటి కన్నీటి కథలు . తెలుగు నాట కోళ్ల ఫారాలలో ఎనెన్నో వ్యధలు.
👉లక్షల్లో ఒకడుఐఐటీ డిగ్రీ తో అమెరికా కెళుతాడు . అమెరికా కు వెళ్ళిపోతే సినిమా సూపర్ హిట్ అనుకొనే ఇక్కడి పేరెంట్స్ కు అక్కడి పిల్లలకేసే గంపెడు వాక్ సీన్ లు . దాని వల్ల పుట్టబోయే మనుమలు మనుమరాండ్రు కు వచ్చే అవకాశమున్న ఆటో ఇమ్యూన్ వ్యాధులు , ఆటిజాలు గురించి తెలియదు . చెప్పినా నమ్మరు . చెప్పేవాడికి మతి లేదని లేదా అందని ద్రాక్ష పుల్లన అంటారు.
అజ్ఞానమే ఆనందం.
❌అర్జెంటు గా అమెరికా కు వెళ్ళిపోవాలి . అక్కడి డాలర్ లు ఇక్కడికి పంపిస్తే నాలుగు సైట్స్ కొనాలి . అందరితో గొప్పలు చెప్పుకోవాలి . అటు పై అరవై అయిదు వచ్చే వరకు రెండేళ్లకు ఒక సారి అక్కడికెళ్లి వచ్చి నాలుగురుకి కబుర్లు చెప్పాలి .. ఇదీ ఆలోచన ... .ఇదీ తీరు
ఈ పోస్ట్ భావమేమి ?
ఐఐటీ లో చేరొద్దన్నా ? అమెరికా కు వెళ్లొదనా ?
✔️కానే కాదు. ఐఐటీ లు ప్రపంచ స్థాయి సంస్థలు . ఉత్తమ విద్యా ప్రమాణాలు .
✔️అమెరికా కో మరో చోటుకు వెళ్లడం సహజం . మనది నేడు విశ్వ గ్రామం . రానున్నది రోబో యుగం .
❌అమెరికా కో ఇంకో చోటుకు వెళిపోతేనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి .. అక్కడికి పొతే ఇక సమస్యలే ఉండవు --అనుకోవడమే పెద్ద సమస్య .
👉సమస్యలు లేని చోటు సమాధి ఒక్కటే ..
సమస్యలు లేని జీవితం నరకం అని తెలుసుకోకపోవడం వీరి అజ్ఞానం
❌తాను సాధించలేని దాన్ని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని అనుకోవడం .
❌పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోక పోవడం .
❌అన్నిటికీ మించి "కోచింగ్ కోసం .. కోచింగ్ ద్వారా ... కోచింగ్ మూలంగా" సాగే ఐఐటీ సీట్ ల భర్తీ . అందుకే ఒక టీవీ ఇంటర్వ్యూ లో నేను ఐఐటీ లు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పాను. కోట్లాది పిల్లల శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మొత్తంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేసి సాగుతున్న రాక్షస క్రీడ ఐఐటీ జేఈఈ పరీక్ష .
✔️ఐఐటీ లు సంతోష కర జీవనాన్ని సాగించడానికి ఒక మార్గం . ఎవరూ కాదనలేని సత్యం .
కానీ ఐఐటీ లో సీట్ సాధించడమే జీవితం . ఆ ప్రయత్నం లో పిల్లల మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత నాశనం అయినా ఫరవాలేదు అనుకొనే సగటు మధ్య తరగతి పేరెంట్ మనస్తత్వం మారనంత వరకు... ఇండియా లో బాల్యం శాపమే ! .
 

ఇలాంటి మరోన్నో అంశాలపై పోస్ట్ లు నా Telegram Channel లో చూడొచ్చు. ఛానల్ లింక్స్ కోసం 

 7207439500 కి Telegram app  లో msg చేయండి 

లేదా 

Join my  WhatsApp community. https://chat.whatsapp.com/BWJMH7xD7UuJG5bEQXID1N

⁉️ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ? 👉పాఠం సరిగా చెప్పక పొతే... ఉపాధ్యాయుడిది తప్పు . 👉విద్యార్థిని సరిగా ప్రోత్సహించక పొతే .. ఉపాధ్యాయుడిది తప్పు . ✔️ఉపాధ్యాయుడిది తప్పైనప్పుడు శిక్షించొచ్చు . ❌కానీ పాఠం బాగా చెప్పి, బాగా మోటివేట్ చేసినా, విద్యార్థి సరిగా చదవక పొతే .. ఆ కారణంగా ఫెయిల్ అయితే తప్పెవరిది.
పూర్తిగా చదవండి 👇
https://t.me/smdmaths/294
చూచి రాత ! చాచి వాత !
పూర్తిగా చదవండి 👇
https://t.me/mathsfor10thclass/79
కడుపు లోకి తోసి , ఆ పై కక్కేస్తే కండపుష్టి వస్తుందా ? తిన్న అన్నం ఒంటపట్టాలంటే జీర్ణమవ్వాలి . అప్పుడే శక్తి.. కండ పుష్టి . కదా ? బట్టీ చదువులు ఇదే బాపతు . సమాచారాన్ని బుర్ర లోపలి కి తోసి అటు పై పరీక్ష హాల్లో కక్కేయయడమే .
పూర్తిగా చదవండి 👇
https://t.me/smdmaths/285
ఏది మంచి స్కూల్? - 1 రాజులు - రాజ్యాలు, కులవృత్తులు.... గతం . మంచి విద్యే పిల్లల భవిత... అనేది వర్తమానం . వాస్తవాన్ని గ్రహించి పిల్లల కు మంచి విద్య అందించడానికి తల్లితండ్రులు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమవుతున్నారు . కానీ మంచి బడి ఎంపిక ఎలా ? పూర్తిగా చదవండి 👇 https://t.me/smdmaths/283
తిమింగలాలు వచ్చేసాయి !
మాయమవుతున్న చిన్న స్కూల్స్ !
ఆస్తులమ్మినా ఫీజు కట్టలేరు .
........ ఇదీ భవిష్యద్దర్శనం
ప్రైవేట్ స్కూల్ - ఫి " జులుం " - దోపిడీ .. లాంటి వార్తలు చాలా సార్లు చూసే ఉంటారు.
పై పైగా కాకుండా విషయం లోతుల్లోకి వెళుదామా ?
పూర్తిగా చదవండి👇

https://t.me/smdmaths/281

ఫ్లేవర్స్ కాలక్రమంలో ఇలా మిస్ అవుతుంటాయి..!!
అదో నవల.. కధానాయిక గురించి రచయిత వర్ణిస్తూ.. "ఆమె మొహం చంద్రబింబం వలే ప్రకాశిస్తోంది" అని రాశాడు.
కాస్తో కూస్తో ఊహాశక్తి మిగిలి ఉన్న పాఠకుడు, అప్పటికప్పుడు ఊహల్లోకి వెళ్లి చంద్రబింబాన్ని గుర్తు తెచ్చుకుని, ఆమె రూపం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకున్నాక తర్వాతి వాక్యంలోకి వెళ్లాడు.
-------------------
పాతికేళ్లు గడిచిపోయాయి. లాజికల్ థింకింగ్ పేరిట ఊహాశక్తిని చంపి పారేశారు. ఊహలు కలిగి ఉన్న వాడిని పిచ్చివాడిగా ట్రీట్ చెయ్యడం మొదలుపెట్టారు. "ఎప్పుడూ అలా ఆకాశంలో ఊహల్లో చూస్తూ ఉండకపోతే పనికొచ్చే పనేదైనా చేయొచ్చు కదా" అని మనిషికున్న కాస్తో కూస్తో మిగిలి ఉన్న ఇమాజినేటివ్ పవర్‌ని కాలరాశారు.పూర్తిగా చదవండి

https://t.me/jakkanilogics/34

పోగాలము దాపురించిన నాడు ....
👇👇👇👇👇👇
ఎక్కడ మొదలెట్టాలి ???
👉ఒక ఆన్లైన్ ఎడ్యు కంపెనీ . స్కూల్స్ మూసి ఉంటేనే తన బిజినెస్ .
👉స్కూల్ తెరవకుండా ఉండడానికి కోట్లు ఖర్చు పెట్టింది . అధికారులు , మీడియా , సంఘాలు అన్నింటినీ కొనేసింది . లేదా మభ్య పెట్టింది .
పూర్తిగా చదవండి 👇 https://t.me/smdmaths/265

👉విద్యార్ధి క్లాసులో పాఠం పై మనసు లగ్నం చేయాలి . 👉✔️గ్రహణ , ✔️విశ్లేషణ , ✔️అనుప్రయుక్తం అనే పద్దతిలో ✔️✔️విద్యా పరమైన తెలివితేటలు , దానితో పాటే ✔️సామజిక తెలివితేటలు , ✔️భావోద్వేగ తెలివితేటలు , ✔️అభిజ్ఞా వశ్యత , ✔️ఇంగితజ్ఞానం , ✔️పార్శ్వ ఆలోచన , ✔️కిష్ట సమస్యలు తీర్చే నైపుణ్యం , ✔️నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలి .


పూర్తిగా చదవండి👇
https://t.me/jakkanilogics/14

ఈ లింక్స్ ఓపెన్ అవ్వకపోతే 7207439500 number కి Telegram app లో msg చేయండి . 

నా Telegram Channel links మీకు సెండ్ చేస్తాను 

(ఈ పేజి లో కనపడుతున్న అన్ని పోస్ట్ లని మీరు నా టెలిగ్రామ్ ఛానల్ లో పూర్తిగా చదవవచ్చు )

 

అందరూ బీటెక్కులూ, మెడిసిన్లే సదవాలి.. అందరూ సాప్టు"వేర్లు" అయిపోవాలి.. అందరూ DSC లే రాయాలి.. అందరూ bank exams కే prepare అవ్వాలి..
పూర్తిగా చదవండి 👇

https://t.me/jakkanilogics/10

1 . కొన్ని పాఠశాలల్లో {ఒకటి నుంచి ఐదో తరగతి కి సంబంధించి న} పాఠ్య పుస్తకాలు ఎక్కువ పేజీలతో ఉంటాయి . ఒక్కో పాఠం నిడివి ఎక్కువగా ఉండి , ఎంతో సమాచారం ఇస్తుంది . అదే మా లాంటి పాఠశాలల్లో ఒక్కో పాఠం, కేవలం రెండు మూడు పేజీలు. తక్కువ లెసన్స్ . బుల్లి పాఠ్య పుస్తకం .

పూర్తిగా చదవండి 👇

https://t.me/jakkanilogics/9

నువ్వు చేసేపని నువ్వు ఇష్టపడి చేస్తూ .... దానివల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కునే శక్తీ నీకుంటే నువ్వు చేసేది తప్పులేదు ... కానీ ఆ పని నీ చుట్టుపక్కల వాళ్ళు అందరు చేస్తున్నారని , వాళ్ళలా ఉండకపోతే నిన్ను అందరు వింతగా చూస్తారని .. నీకు దూరంగా ఉంటారని అనే భయంతో చేయకు ..


పూర్తిగా చదవండి 👇

https://t.me/jakkanilogics/8

అతీంద్రియ శక్తుల గురించి, మనిషి మేధస్సుకి అర్థం కాని విషయాల గురించి సహజంగా ఒకటే వాదన వినిపిస్తూ ఉంటుంది. "ఇది సైంటిఫిక్‌గా నిరూపితం కాలేదు, కాబట్టి నమ్మదగినది కాదు" అని! సైంటిఫిక్‌గా నిరూపితం కావాలంటే పరిశోధనలు జరగాలి. ఎవరు పరిశోధనలు చేయాలి? శాస్త్రవేత్తలు. మరి వారు పరిశోధనలు చేయాలంటే భారీ మొత్తంలో నిధులు కావాలి.

పూర్తిగా చదవండి 👇
https://t.me/jakkanilogics/11